సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత శనివారం రాత్రి కాకినాడలో ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల జనసేన పార్టీ నాయకుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘ డబ్బు, పేరు కాదు.. జనసేన పార్టీ శ్రేణులను బలమైన ఆలోచనా విధానం కలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక భూమిక పోషించే ఉభయ గోదావరి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకూడదు. వైసీపీ రహిత గోదావరి జిల్లాలుగా మారాలి. దానికోసం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బలమైన వ్యూహం ఉండాలి. జన సైనికులు నా ప్రక్కన 2 ఫోటోలు దిగి మురిసిపోవడం కాదు.. మీ ప్రాంతాలలో జనసేన పార్టీ ఆశయాలను ప్రతి ఇంటికి తీసుకొనివెళ్ళితే మన లక్ష్యం సాధ్యమౌతుంది దానికి జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పూర్తిస్థాయి ప్రణాళికతో సంసిద్ధమవ్వాలని పిలుపు నిచ్చారు. నాకు ప్రాణ హాని ఉందని గతంలో పార్టీ పెట్టినప్పుడే చెంపేస్తామని బెదిరించారని అయితే ఇటువంటి క్రిమినల్స్ లేని ప్రభుత్వం రావాలని పట్టుదల పెరిగిందని అన్నారు, ప్రజలు నా దగ్గరకు వచ్చి చెప్పే వేల వేదనలు నిత్యం వింటూ, రాత్రి వేళ వారి గురించి ఆలోచిస్తూ బరువెక్కిన గుండెతో నిద్రపోతాను. ప్రజల వేదనలు, వారి కన్నీటి గాథలే నన్ను మరింత రాటు దేల్చాయి. ఘోరమైన ఓటమి తర్వాత కూడా నేను నిలబడి ఉన్నానంటే వారికి ఏదైనా మేలు చేయాలన్న బలమైన సంకల్పమే నన్ను ముందుకు నడిపిస్తోంది,అన్నారు. (అయితే ఉభయ గోదావరి జిల్లాలలోని 34 సీట్లు కూడా ‘జనసేన’ మాత్రమే పోటీ చేస్తుందని జనసేనాని చెప్పకపోవడం గమనార్హం..)
