సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అమరావతి లోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా తో మాట్లాడుతూ.. ఏపీలో రైతుల దుస్థితి ఘోరంగా ఉందని .. ఏపీలో గంజాయి పంట మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలో ఉన్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం రైతును గాలికి వదిలేసిందని ఇక ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కేసులు.. వనరుల దోపిడీ ఇదే జగన్ పాలన అని చంద్రబాబు విమర్శించారు, . ఏపీలో రైతు వెంటిలేటర్ మీదున్నాడన్నారు. కర్నూల్లో పత్తి, సీమలో వేరుశనగ రైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు.. ఉత్తరాంధ్ర జీడి రైతు.. ఒక్కరైనా బాగున్నారా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. సీమలో హార్టికల్చర్.. కోస్తాలో ఆక్వా కల్చర్‌కు తమ హయాంలో ప్రాధాన్యం ఇచ్చామని వాటి ఫలితాలే ఇప్పుడు వస్తున్నాయని, ఆక్వా, హర్టికల్చర్ రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. అయితే వాటికీ మించి ఏపీలో అద్భుతంగా సాగయ్యే పంట గంజాయి పంట అని పేర్కొన్నారు. నాలుగేళ్లల్లో మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రస్తుతం రాష్టంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మినహా ఎక్కడా పంటలు వేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా చంపేసిందన్నారు చంద్రబాబు.
