సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి గోదావరి జిల్లాలలో అతిత్వరలో పొగ, కాలుష్య డీజిల్ రహిత ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చెయ్యడానికి ఏపీ ఆర్టీసీ సిద్ధం అవుతుంది. వాస్తవానికి ఒక్కో ఎలక్ట్రికల్ బస్సు ధర రూ.1.50కోట్లు. వీటిని ప్రఖ్యాత కంపెనీలనుంచే కొనుగోలు చేయబోతున్నారు. పైగా వీటిలో ఆధునిక సౌకర్యాలన్నీ ఉంటాయి. ఈ లెక్కన 150 బస్సుల కు రూ.225కోట్ల వరకు ఖర్చవనుంది. ఈ మేరకు ఉమ్మడి గోదావరి జిల్లాల లో 150 ఎలక్ట్రికల్ బస్సులను ఏయే రూట్లలో తిప్పాలనేదానిపై ఇప్పటికే అధికారులు కసరత్తు పూర్తిచేశారు. బస్సు రూట్లలో 20చోట్ల ఛార్జింగ్ సెంటర్స్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాకినాడ జిల్లా కేంద్రం డిపో నుంచి నడపనున్న 50 బస్సుల్లో కొన్ని కాకినాడ-అమలాపురం, కాకినాడ – భీమవరం, కాకినాడ-రాజమహేంద్రవరం, కాకినాడ-తుని రూట్లలో నడపాలని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం డిపోనుంచి కాకినాడ, తుని, అమలాపురం, భీమవరం,ఏలూరు, విశాఖ వరకు నడపాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. బస్సు ప్రయాణం పడని ప్రయాణికులకు సైతం డీజిల్ వాసన రాకుండా ఈ- బస్సులు సోకర్యవంతంగా ఉంటాయి.
