సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో నేడు, శనివారం ఉదయం ఉమ్మడి గోదావరి జిల్లా కాపునాడు పట్టణ, మండల ప్రతినిధులు సమావేశమయ్యారు. రాజకీయ పార్టీలకతీతంగా కాపు నేతలు ప్రముఖులు ఈ సమావేశానికి హాజరయ్యారు. భీమవరం నుండి కూడా కీలకనేతలు తరలివెళ్లారు. కాపుల భవిష్యత్తు కోసం పార్టీలకతీతంగా కృషి చేయాలని సభ్యులు సూచించారు. గతంలో ఎన్నికల ముందు కాపు రిజర్వేషన్లపై హామీలు ఇచ్చి ఎన్నికల తర్వాత వాటిని మరిచారనీ ఈసారి మోసపోకూడదని ఏ రాజకీయ పార్టీ అయితే కాపుల రిజెర్వేషన్ .. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతకై పాటుపడే హామీ ఇస్తుందో ఆ పార్టీకే మద్దతు తెలపాలని సమావేశంలో కాపు జేఏసీ తీర్మానం చేసింది.
