సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యో గుల సర్వీసులను ఇక రెగ్యులైజ్ చేస్తామని ప్రకటించడం తో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 980 మంది ఉద్యోగులు పర్మినెంట్ కానున్నారు. దీనితో ఉద్యో గ సంఘాల ప్రతినిధులు ఆనందంతో సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తు కుటుంబ సభ్యులతో కలసి సంబరాలు చేస్తూకొంటున్నారు. ప్రజా సంకల్పపాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు, భీమవరం ,తాడేపల్లిగూడెం , తణుకు తదితర ప్రాంతాల్లో సీఎం జగన్ ఫ్లెక్సీ,చిత్రపటాలకు, క్షీరాభిషేకాలు చేయడంతో పాటు స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే లను కలిసి తమ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *