సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకుడు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఏలూరు కలెక్టరేట్లో కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ అరుణ్ బాబుతో ఎన్ని కల ఏర్పాట్లపై సమీక్షించారు. నామినేషన్ గడువు ముగిసే సరికి (2 ఎమ్మెల్సీ స్థానాలకు) ఎనిమిది మంది అభ్యర్థులు 15 నామినేషన్స్ సమర్పించారని, ఈ నెల 24న వాటిని పరిశీలిస్తామని తెలిపారు. నామినేషన్స్ ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఉందన్నారు. ఇద్దరు కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే మాత్రం మార్చి 13న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 16న ఫలితాలను ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైనా నియమావళిని ఉల్లంఘిస్తే 85275 95439 కు ఫోన్ చెయ్యాలని జిల్లా ఎన్నికల అధికారి, ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఒకప్రకటనలో తెలిపారు.
