సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎన్ని కల బరిలో ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతారని భావించినప్పటికీ నిన్న సోమవారం నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసే నాటికీ ఆరుగురు అభ్య ర్థులు మిగిలారు. దీనితో ఎన్నికల పోలింగ్ తప్పనిసరి అయ్యింది. ఇక ఎన్నికలలో వైసిపి పార్టీ నుండి కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, స్వతంత్ర అభ్యర్థులు వీరవల్లి చంద్రశేఖర్, దేవరపల్లి ఆదాం , గోరింక దాసు, పసల వెంకటాచలం పోటీలో నిలిచారు. మార్చి 13న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం , కొవ్వూరు, భీమవరం నరసాపురం, ఎం పీడీవో కార్యాలయాల్లో ఏర్పా టు చేసిన కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందని ఆర్వో ప్రకటించారు.
