సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీకి తాజా గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండరులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాఠశాల విద్యా శాఖలో 215 ఉద్యోగ నియామకాలు కు అవకాశం ఉంది. (ఇటీవల 16 వేలకుపైగా టీచర్ కొలువులకు మెగా డీఎస్సీ– 2025 నియామకాలు పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో కొన్ని పోస్టులు భర్తీ కాకుండానే మిగిలిపోయాయి) వచ్చే అక్టోబరులో విడుదల చేసే డీఎస్సీ నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ప్రకటించే ఉపాధ్యాయ ఖాళీల సంఖ్యలో ఉమ్మడి జిల్లాకు కేటాయించే పోస్టుల్లో కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. కేంద్ర ప్రభుత్వం యు–డైస్ డేటా ప్రకారం గత ఏడాది రాష్ట్రానికి మంజూరుచేసిన 700 స్పెషల్ ఎడ్యుకే షన్(దివ్యాంగులకు బోధించే ప్రత్యేక విద్య/ విలీన విద్య) పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు కేటా యించిన 38 ఖాళీలతోపాటు, మెగా డీఎస్సీ– 2025లో భర్తీ కాకుండా మిగిలిన 11 బ్యాక్లాగ్ పోస్టులు, గత జూన్ 1 నుంచి ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరు వరకు ఏర్పడే రిటైర్మెంట్ ఖాళీలతో డీఎస్సీ–2026 నోటిఫికేషన్లో 215 ఉద్యో గాలను భర్తీ చెయ్యవలసి ఉంది.
