సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో, ఉన్న కోర్టులలో రేపు శనివారం అనగా ఈనెల 29న జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. పురుషోత్తమకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ లోక్ అదాలత్‌లో సివిల్, రాజీపడదగిన క్రిమినల్ కేసులు లతో పాటు ప్రాంసరీ నోటు దావాలు, ఆస్తిదావాలు, తనఖా, మోటారు వాహన ప్రమాద కేసులు, కార్మిక వివాదాలు, చిట్‌ఫండ్ సంబంధిత, ఆర్బిటేషన్ కింద రికవరీ కేసులు పరిష్కరిస్తామన్నారు. ఇంకా చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ వివాదాలు, దాంపత్య హక్కుల పునరుద్దరణ, నిర్వహణ, సంబంధిత సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నరసాపురంలలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీలలో వీడియోకాన్ఫరెన్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామన్నారు. దూర ప్రదేశాలు ఉన్న కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసులు వారు ఉన్న ప్రదేశం నుంచే వీడియో కాన్ఫరెన్సుతో కూడా కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ సమాచారం కావాలంటే ఏలూరులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఫోన్ నంబరు 08812–22455ను గాని వాట్సాప్ నంబరు 94409 01064లో సంప్రదించాలి.
