సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరదలను స్వయమాగా సమీక్షించిన చంద్రబాబు తమ్మిలేరు ను పరిశీలించిన అనంతరం ఆయన ఏలూరు సీఆర్‌రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయిన రైతులు, వరద బాధితులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 17వ తేదీలోపు నష్ట పరిహారంపై నిర్ణయం తీసుకుంటామని, వరికి మాత్రం ఎకరానికి రూ. 10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించా మన్నారు. ఉప్పుటేరుపై రెగ్యెలేటర్ నిర్మాణంపై సీరియస్‌గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం హయాంలో 72 శాతం పూర్తిచేసామని.. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసాడని ఆరోపించారు. . ఇప్పుడు పోలవరం కోసం కేంద్రంతో మాట్లాడి రూ. 12 వేల కోట్లు తీసుకువచ్చామన్నారు. త్వరలోనే పోలవరం పనులు మొదలుపెడతామని స్పష్టం చేశారు. వరదలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తీసుకుంటామని, వరదల వలన సాగునీటి సంఘాల ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, త్వరలోనే అవి వస్తాయని తెలిపారు. శనివారపుపేట కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నానని, త్వరలో కౌలు రైతుల ఖాతాల్లోకి నేరు ఇన్ పుట్ సబ్సీడీ వేస్తామని ప్రకటించారు.
