సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీధి వ్యాపారులకు మరింత ఆదాయం అభివృద్ధికి ప్రత్యేకంగా లోక్‌ కల్యాణ్‌ మేళాను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మున్సిపాలిటీ, మరియు ఏలూరు నగర పాలక సంస్థతో సహా పలు ప్రధాన పట్టణాలలో దీపావళి పండుగ తరువాత.. ఈ నెల 24 నుంచి ప్రత్యేక మేళాలు జరుగుతున్నాయి. ఈ మేళా ద్వారా వీధి వ్యాపారులకు వివిధ పథకాలతో అనుసంధానం చేసి, గుర్తింపు, ఆరోగ్య కార్డులు అందజేస్తారు. అంతేకాకుండా, డిజిటల్ చెల్లింపులపై అవగాహన కల్పిస్తారు. అర్హులైన వారికి రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు 7 శాతం వడ్డీతో ఇస్తారు. సక్రమంగా వాయిదాలు చెల్లిస్తే వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *