సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్రా ష్ట్ర వ్యాప్తంగా తాజగా ప్రకటించిన 47 ఏఏంసీ ఛైర్మెన్ల పదవుల్లో 37 టిడిపి, 8 జనసేన, 2 బీజేపీ నేతలకు దక్కాయి. వాటిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, దెందులూరు, తణుకు, తాడేపల్లి గూడెం, నరసాపురం, యలమంచిలి మార్కెట్ యార్డులకు చైర్మన్లను ఇతర సభ్యులను ప్రకటించడం జరిగింది. ఏలూరుకు మామిళ్లపల్లి ప్రభు, తణుకు కు కొండేటి శివ, నర్సాపురం కు యలమంచిలి భాస్కర్, తాడేపల్లి గూడెంకు చేపళ్ళ మంగాబాయి దెందులూరు కు గారపాటి రాందాస్, యలమంచిలి కి తట్ట లోవకుమారి ని చైర్మెన్ లుగా నియామకాలు జరిగాయి. వీటిలో ఒక్క యలమంచిలి లో జనసేన పార్టీ మినహాయిస్తే మిగతా మార్కెట్ యార్డ్ చైర్మెన్ లుగా టీడీపీ నేతలే ఎంపిక కావడం గమనార్హం
