సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగులకు మంచి రోజులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా చూసుకొంటే.. ఎన్నికల ముందు హడావిడిగా గత ఫిబ్రవరి నెలలో డీఎస్సీ ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం హయాంలో 228 టీచర్లు పోస్టులకు నోటిఫై చెయ్యగా ,కొత్తగా, చంద్రబాబు ఆద్వర్యంలోని కూటమి ప్రభుత్వం వీటికి అదనంగా 839 పోస్టులు ను చేర్చడం తో మొత్తం 1,067 పోస్టులను భర్తీ కి అవకాశంభించినట్లయింది. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించింది. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు పూర్తీ కావస్తుంది. . ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పాఠశాల విద్యాశాఖతోపాటు, గిరిజన, సాంఘిక, వెనుకబడిన తరగతులు తదితర సంక్షేమ శాఖల యాజమాన్యాల్లోని పాఠశాలలు, గురుకులాలు, మోడల్‌ స్కూల్స్‌లో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్లలో మొత్తం 1067 ఉపాధ్యాయ నియామకాలకు కూటమి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం గమనార్హం, ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో అన్ని కేడర్లలో కలిపి మొత్తం 725 ఖాళీ పోస్టులను గుర్తించారు. మిగతా 342 ఖాళీలను సంక్షేమ శాఖల యాజమాన్యాల్లోని పాఠశాలల్లో భర్తీ చేసేందుకు అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *