సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా మరల కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మరోసారి ఏడు కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో 4, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 గురికి కరోనా సోకడంతో బాధితులు హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు పేర్కొ న్నారు. ( అనధికారికంగా మరెంతమందికి కోవిద్ సోకి ఉందొ? ) కొవిడ్ నిబంధనలు తప్ప నిసరిగా పాటించాలని,విధిగా మాస్కులు ధరించాలని, ఎక్కువ ప్రజా సమూహాలున్న చోట దూరంగా ఉండాలని, శుభ్రత పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాథమిక కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్ల్ పరీక్షలు అందుబాటులో ఉంచి, ర్యా పిడ్, వీఆర్డీఎల్ పరీక్షలు చేస్తున్నారు. ఇక ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కొండపల్లిలో కరోనాతో ఓ వ్య క్తి మరణించటంతో వైద్య సిబ్బంది. అప్రమత్తమయ్యా రు. గత శనివారం ఆ గ్రామం లో మృతుని కుటుంబ సభ్యులు, ఆ పరిసర ప్రాం తాల ప్రజలకు కరోనాపరీక్షలు నిర్వహిం చారు. అయితే ఎవరికీ అక్కడ కరోనా సోకక పోవడం గమనార్హం.
