సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిన్న ఆదివారం, నేడు, సోమవారం ఈ వేసవి సీజన్ లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు పెద్దలు, పిల్లలు విలవిల లాడుతున్నారు. మరో ప్రక్క విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కేంద్రాలు భీమవరం ఏలూరుతో పాటు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ద్వారకా తిరుమల, పోలవరం, భీమడోలు తదితర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదు కాగా రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెంటీగ్రేడ్‌గా నమోదయ్యాయి.పాలకొల్లు, నర్సాపురం లలో 39 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.రేపు మంగళవారం కూడా వడగాల్పుల తీవ్రత ఉండనుంది.గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో ఉంటాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. గాలిలో తేమ శాతం తగ్గడంతో ఉదయం 7గంటల నుండి ఉక్కబోత విపరీతం గా పెరిగింది. మరో ప్రక్క ఉదయం 9 గంటల నుండి వడగాల్పులు తీవ్రత విపరీతంగా ఉంటోంది. ప్రధాన రహదారులపై జనసం చారం లేదు. జ్యూస్ , కొబ్బరి బొండాలు, శీతల పానీయాలకు గిరాకీ పెరిగింది. అత్యధిక ఉష్ణోగ్రతల ప్రభావం చేపల, రోయ్య చెరువుల పంట ఫై ప్రభావం చూపుతోంది. చేపల చెరువుల్లో నీరు బాగా వేడెక్కి ఆక్సిజన్ సమస్యలతో చేప, రొయ్య నష్టపోతున్నామని ఆక్వా రైతులు వాపోతున్నారు.
