సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు నేడు, బుధవారం నుంచి ప్రశాంత వాతావరణం లో ప్రారంభం అయ్యాయి. ఉదయం పూట జరిగే ప్రథమ సంవత్సరం పరీక్షలకు ఉమ్మడి జిల్లాలో 22,906 మంది, మధ్యాహ్నం పూట జరిగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 11,386 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉమ్మడి జిల్లాలో భీమవరం, ఏలూరు తదితర పట్టణలలో మొత్తం 69 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అరగంట ముందుగానే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు, పరీక్షల నిర్వహణ సిబ్బంది కోసం అన్ని పరీక్ష కేంద్రాల్లో ప్రథమ చికిత్సా బృందాలును , ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను పరీక్షా కేంద్రాల ఆవరణలో ఏర్పాటు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *