సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపు . సోమవారం మధ్యాహ్నం చిన తిరుపతిగా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమల మండలం ఐ.ఎస్. జగన్నాధ పురంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఆయన దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఐఎస్ జగన్నాధపురంలో మ్యాజిక్ డ్రైన్ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అంతకు ముందు హైదరాబాద్ నుండి సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ కల్యాణ్.. రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా మధ్యాహ్నం 12. 00 గంటలకు ఆయన ఐ.ఎస్. జగన్నాధపురం చేరుకుంటారు.ఇప్పటికే ఆయా ప్రాంతాలలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
