సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు కొందరికి అర్హతను బట్టి నియోజకవర్గానికి వచ్చి 10 చప్పున ఉచితంగా మూడు చక్రాల మోటార్‌ వాహనాలను (ఒక్కొకటి 1లక్ష 30వేలు విలువచేసే) అందించాలని నిర్ణయించింది. 70 శాతం కన్నా ఎక్కువ శారీరక వైకల్యం కలిగి ఉండాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పథకానికి అర్హు లు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 39 వేల 356 శారీరక దివ్యాంగులు ఉన్నారు. వీరిలో జిల్లాలో 15 నియోజకవర్గాలకు కలపి 150 మందికి మోటారు వాహనాలు కేటాయింపుకు అవకాశం ఉంది. వీరిలో అర్హత కలిగినవారు ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల ని ప్రభుత్వం సూచించింది. వీటిలో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *