సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఏలూరు జిల్లాలో ముసునూరు పోలీస్ స్టేషన్ లో ఎస్‌ఐ గా ఇటీవల జాయిన్ అయిన యు.లక్ష్మీనారాయణ రాష్ట్ర డీజీపీకి రాజీనామా లేఖ పంపారు. దీనిపై ఆయన మీడియా కు వివరణ ఇస్తూ.. తాను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్‌ఐగా 2009 నుంచి గోదావరి జిల్లాలలో వివిధ పోలీ్‌సస్టేషన్లలో సమర్ధంగా విధులు నిర్వర్తించి, అవినీతి రహితంగా ప్రజల కు సేవ చేసానని, అయినప్పటికీ గతంలో కొవ్వూరులో పనిచేస్తున్న సమయంలో ఒక కేసు విషయమై తనపై అవినీతి ఆరోపణలు వచ్చాయంటూ వీఆర్‌లో ఉంచారని, గత పదిరోజుల క్రితం ముసునూరు ఎస్‌ఐగా నియమించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఆరోపణలు వచ్చిన కేసులో తనను రెండు రోజుల క్రితం సస్పెండ్ చేయటం తో చాల మనస్థాపం చెందానని, చెయ్యని తప్పుకు బాధ్యత వహించలేక తాను ఉద్యోగం నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకొన్నానన్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా లేఖను డీజీపీకి పంపినట్టు లక్ష్మీనారాయణ ప్రకటించారు.
