సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా నేడు, గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పోలవరం డాం వద్దకు చంద్రబాబు సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వారితో వాగ్వాదానికి దిగిన చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు పోలవరం డ్యాం సైట్ కు వెళ్లే మార్గంలో రోడ్డుపై క్రింద కూర్చుని నేలపై బైఠాయించారు. పోలీస్ అధికారులు ఆయనను బ్రతిమిలాడాడటంతో తనతో పాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసుల్ని ఆయన కోరారు. అనుమతి ఇవ్వలేమంటూ పోలీసులు నిరాకరించారు. దానితో పోలవరం వద్దకు నేటి సాయంత్రానికి పొద్దుపోవడంతో పార్టీ శ్రేణులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. చంద్రబాబుతో పాటు , దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు, బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ తదితరులు రోడ్డుపై బైఠాయించారు. తాను పోలవరం ఎందుకు వెళ్లకూడదో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రోడ్డుపై బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు శుక్రవారం చంద్రబాబు తణుకు పట్టణం లో నేతలను కలసి అక్కడి నుండి తాడేపల్లి గూడెం వరకు రోడ్ షో లు చేస్తూ సాయంత్రం బహిరంగసభలో పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *