సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మహాశివరాత్రి సందర్భంగా నిన్న, శనివారం నేడు, ఆదివారం ఏలూరు సమీపంలోని బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయమునకు విచ్చేయు వేలాది భక్తులకు పెదవేగి మండలం విజయరాయిలోని బలివే అడ్డరోడ్డు వద్ద తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి ఆధ్వర్యంలో భారీ ప్రసాద వితరణకు ఏర్పాట్లు చేసారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్లే భక్తులకు ప్రత్యేకంగా బ్రాహ్మణులచే మూడు రకాల ప్రసాదాలను వండించి చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, మజ్జిగ, మంచినీటిని తపన వలంటీర్లు అందజేశారు. 50 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ,చేశామని గారపాటి చౌదరి చెప్పారు. తపన ఫౌండేషన్‌ స్థాపించి 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మహాశివరాత్రి రోజున బలివే తోపాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ, తాడువాయి, కలిదిండి లలో కూడా భక్తులకు తపన ఫౌండేషన్ తరపున ప్రసాద వితరణ, మజ్జిగ ప్యాకెట్లను అందించినట్లు గారపాటి చౌదరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *