సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ప్రవేటు సంస్థలలో నకిలీ సర్టిఫికెట్లు తో ఉద్యొగాలు చేస్తున్నవారు ఉంటెనే అది పెద్ద తప్పుగా పరిగణించి దానిఫై అగ్రిమెంట్ ప్రకారం తీవ్ర చర్యలు తీసుకొంటారు. అటువంటిది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యు త్ శాఖలో 31 మంది నకిలీ ఉద్యో గులు పనిచేస్తూ గత పాతికేళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు, సర్వీస్ సర్టిఫికెట్లతో నెల నెల జీతాలు, ప్రమోషన్స్ కూడా సంపాదించి వివిధ హోదాలు వెలగబెడుతున్నారనే సమాచారం ఇటీవల గగ్గోలు పుట్టిస్తుంది, దీనిపై సంబంధిత శాఖ ఉన్న తాధికారులు దృష్టి సారించారు. ఉమ్మ డి జిల్లా వ్యా ప్తం గా మొత్తం 31 మం ది నకిలీ ఉద్యో గులకు సం బంధించిన వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నివేదికను ఇవ్వా లని విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం లోని డైరెక్టర్ ఆఫ్ఫైనాన్స్కు సీఎం డీ ఐ. పృథ్వీ తేజ్ తాజగా ఆదేశాలు జారీచేశారు, వీరిలో కొందరు యూనియన్ నేతల బంధువులు కూడా నకిలీ ఉద్యోగులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. విచారణ పూర్తీ అయితే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, అంతవరకూ ఆ 31 మంది ఉద్యోగుల సేవలను గౌరవించవలసిందే మరి,,
.
