సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, నాయకులతో నేడు, గురువారం జగన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ పార్టీకి చెందిన బీసీ మహిళా పద్మశ్రీ ఇటీవల జిల్లా జడ్పీటిసి చైర్మెన్ వంటి కీలక పదవిలో ఉండి టీడీపీ లో చేరిన నేపథ్యంలో మెజారిటీ సభ్యులు ఉన్న వైసీపీజడ్పీటిసి సభ్యులు ఆమెపై ‘అవిశ్వాస తీర్మానం’ ప్రవేశపెట్టిన నేపథ్యం ఫై జగన్ మాట్లాడుతూ.. ప.గో.జిల్లా జడ్పీ ఛైర్మన్ పార్టీ కి వెన్నుపోటు పొడిచిన మీ జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారు. పార్టీని మోసం చేసిన వారిని పదవి చ్యుతి చెయ్యడానికి అవిశ్వాస తీర్మానం పెట్టి పోరాడుతున్న మీ పోరాట స్ఫూర్తి చూసి గర్విస్తున్నాను. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత మీరు చూపారు. జడ్పీటీసీలు అందరికీ కృతజ్ఞతజ్ఞలు. మీ వ్యక్తిత్వం చాలామందికి ఆదర్శనీయంగా నిలిచింది. అప్పుడే ప్రజల ఆశీస్సులు ఉంటాయని వైఎస్ జగన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని, కేవలం 4 నెలల పాలన కే ప్రజలలో ఈ ప్రభుత్వ పాలనపై తిరుగుబాటు మొదలయిందని అన్నారు. వైయస్సార్సీపీ హయాంలో టన్నుకు రూ. 550లు అయితే, ఇప్పుడు రూ.1375కు అమ్ముతున్నారని చెప్తున్నారు. అన్ని ధరలు పెరిగిపోయాయి. అవినీతి రాజ్యం ఏలుతుంది.మన వైఎస్సార్‌సీపీ ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీను నెరవేర్చిందని తెలిపారు. కోవిడ్ లాంటి సంక్షోభాన్ని రెండేళ్లపాటు ఎదుర్కొన్నామని ఆదాయాలు తగ్గాయని, అయినా ఎక్కడ వెనకడుగు వేయలేదని వైఎస్ జగన్ అన్నారు.
