సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా డీఎస్సీ–2025 పరీక్షలు ఈనెల 6నుంచి 30వ తేదీ వరకు నిర్వహించడానికి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఏలూరు లోని సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ స్కూలు, సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, దుగ్గిరాల ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లలో టెస్టు సెంట ర్లను ఏర్పాటు చేసారు. అభ్యర్థులు కనీసం గంటముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీబీటీ) విధానంలో నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయం త్రం 5గంటల వరకు, ఇంగ్లీషు ప్రొఫీషియన్సీ టెస్టు రోజుకు మూడు సెషన్లలో గంటన్నర నిడివి తో జరుగుతాయి. పరీక్షా రాసె అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటో లు తప్పనిసరిగా తీసుకు రావాలి. సందేహాలు, వివరణల కోసం అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో ఫోన్ నంబర్లు 90307 23444, 95056 44555లలో సంప్రదించాలి.
