సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం జూన్ 2 వ తేదీతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్ళు కొనసాగిన హైదరాబాద్ నగరానికి ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం తీరిపోయింది.. రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అపాయింటెడ్ డే గా జూన్ 2వ తేదీతో గడువు ముగియనుంది.. అయితే అవశేష ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వాల విధానాల ఫలితంగా రాజధాని ఎక్కడ అనేది ఇంకా నిర్థారణ కాలేదు.. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాజధాని ఏర్పాటు కానుంది. కాగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను పొడిగించాలని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి జెడి లక్ష్మీనారాయణ వంటివారు వ్యక్తిగతంగా డిమాండ్ చేసారు. అయితే ఇందుకు చట్ట సవరణ జరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వాలు దీనిపై నిర్ణయం తీసు కోవాల్సి ఉంది. ఏపీ ముఖ్యమంత్రికి లేక్ వ్యూ అతిధిగృహంతో పాటు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, పాత సచివాలయాల్లో వాటా ఇచ్చారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌ను సంయుక్త రాజధానిగా పదేళ్లు ప్రకటించినప్పటికీ 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. అయితే చంద్రబాబు’ ఓటుకు నోటు కేసు ‘ వివాదంలో ఇరుక్కోవడం తో కెసిఆర్ తో జరిగిన లోపాయకారి ఒప్పందాలలో హైదేరాబద్ ఫై హక్కులను ఏడాది కూడా పూర్తీ కాకుండానే శరవేగంగా పరోక్షంగా వదిలేసుకోనట్లు ప్రచారం జరిగింది. మరో ప్రక్క అక్కడ ఎన్నో లక్షల కోట్ల విలువైన ఆస్తులను , విద్యుత్తూ బకాయిలను వదులుకొని వాటిని రాబట్టకుండానే అక్కడే వదిలేసి వచ్చేయడం.. వివాదం ఇప్పటికి కొనసాగుతుండటం గమనార్హం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9, 10, 13కు సంబంధించిన బదలాయింపులతో పాటు దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల లావాదేవీలు పరిష్కారం కావాల్సి ఉంది. అనంతరం 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మూడు రాజధానుల అంశాన్నితెరపైకి తీసుకు రావటం… అయితే ఈ వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది..తాజా సమాచారం ప్రకారం అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ఏపీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే దీన్ని తెలంగాణలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.. ప్రస్తుతం హైదరాబాద్‌లో లేక్‌వ్యూ, ఎన్‌ఎంహెచ్‌ఆర్‌ఎంసీ, ఏపీఈఆర్‌సీ, గ్రేహౌండ్స్ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యదర్శుల క్యాంపు కార్యాలయాలు కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా తెలుగువారికి చరిత్రలో గురుతుంచుకొనే రోజు ఈ రోజు.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్
