సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోపాలపురం లో జరిగిన జనసేన 2024 నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కోటికల పూడి గోవిందరావు (చినబాబు ) పాల్గొన్నారు. ఈ సందర్భముగా ఆయన క్యాడర్ నుద్దేశించి మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ కలయికతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని, జనసైనికులందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ విజయానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.. సీఎం జగన్ అరాచక పాలనకు ముగింపు పలకడానికి ఇక 100 రోజులు సమయం ఉందని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో ( మొత్తం 15 సీట్లకు అంటే టీడీపీ కి 7 సీట్లు )పోటీ చేయాలనే ఆలోచన ఉందని అయితే చివరిగా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అన్నారు. స్థానిక కేఎస్‌.రెడ్డి ఫంక్షన్‌ హాలులో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి దొడ్డిగర్ల సువ ర్ణరాజు అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *