సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అందరికి తెలసిందే.. గత నెల మొదటి వారంలో ఆలా ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి.. ఇలా పెట్రోలు మొదలు అన్ని నిత్యావసర సరుకులు..రిటైల్ మార్కెట్లో కిలో కంది పప్పు ధర నెల క్రితం రూ. 150 ఉండగా..ప్రస్తుతం రూ.180 నుంచి రూ. 200 ధర ఉంది. వర్షాకాలంలో సైతం కాయగూరలు ధరలు పోటీ పడి పెరిగాయి.. దాదాపు అన్ని కూరగాయలు ధరలు రిటైల్ మార్కెట్ లో 1 KG దాదాపు 80 రూపాయలు ఫై మాటే..ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం ఎక్కువ వినియోగించే ఉల్లి, టమోటా ధరల మాత్రం దిగి రావడంలేదు. మరో గత్యంతరం లేకపోవడంతో ప్రజలు పెరిగిన ధరల భారాన్ని మోయకతప్పడంలేదు ఇటీవల రిటైల్ లో 50 రూపాయలు కు పెరిగిన ఉల్లి మాత్రం 40 రూ . దిగివచ్చింది. హోల్‌సేల్ మార్కెట్లో నెంబర్ 1 రకం కిలో రూ.36లు ధర ఉంది.రెండో రకం రూ.32, మూడో రకం రూ.28-రూ.30 మధ్య అమ్ముతున్నారు. కర్నాటక, కర్నూలు ఉల్లిపాయలకు సీజన్ కాకపోవడంతో మహారాష్ట్ర నిల్వఉల్లిపాయలపైనే మొత్తం మార్కెట్ ఆధారపడాలి. బహుశా వచ్చే ఆగస్టు నెల నుండి కొత్తపాయలు రావాలి. రేట్లు మరల కేజీ 20- 25 రూ. స్థాయికి రావలి. టమాటా మాత్రం 80 దిగి రానుఅంటుంది. అనంతపురం నుండి టమోటాలు పంట అందుకోవాలి. అప్పటి వరకూ ప్రజలకు తప్పదని హోల్ సేల్ వ్యాపారాలు అంటున్నారు.
