సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో 2 న్నర నెలలు పాటు సుదీర్ఘంగా ఎన్నికలు జరిగాయి. అప్పటివరకు పెట్రోల్ మొదలు అన్ని నిత్యవసర సరుకుల రేట్లు పెరగకుండా సబ్డు గా ఉన్నాయి. ఇక జూన్ మొదటి వారంలో అలా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో లేదో క్షణం ఆలస్యం చెయ్యకుండా దేశంలో పెట్రోల్ మొదలు కేజీ 25 రూ దొరికే ఉల్లి పాయల వరకు అడ్డు అదుపు లేకుండా రేట్లు పెరిగిపోవడం గమనార్హం. ఎట్టకేలకు కేంద్రం కాస్త కనికరించి పేదలకు సామాన్యులకు నిత్యవసరమైన ఉల్లి ధరలను నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ (buffer stock) కోసం ప్రభుత్వం దాదాపు 71 వేల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసింది. ఉల్లి ధర రిటైల్ మార్కెట్లో కిలో రూ50 చేరుకొంటున్న నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ డేటా ప్రకారం రానున్న కాలంలో ఉల్లి ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం 5 లక్షల టన్నుల ఉల్లి కొనుగోలుకు సన్నాహాలుచేస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు సానుకూలంగా ఉంటడంతో రిటైల్ ధరలు కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. బహుశా ఈ వారంలోనే ఉల్లి ధర రిటైల్ మార్కెట్ లో కేజీ 30 వరకు దిగిపోయే అవకాశం స్వష్టంగా కనపడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *