సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఏడాదిగా ఉల్లి ధరలు అలాగే 70 – 50 రూపాయలు మధ్య నిలిచిపోవడం చూసాం.. గత 2 నెలలుగా తగ్గుతూ వచ్చి కేజీ 20- 22 రూపాయల రిటైల్ అమ్మకాలు చూసాం. హమ్మయ్య పాత ధరలకు నిలబడింది అనుకునే లోపే మరల ఉల్లి ధరలు వేగంగా పరుగుపెడుతున్నాయి. ఈనెల జూన్ నెల మొదటి వారంలో కిలో ధర రూ.25 ఉండేది. తర్వాత హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఉల్లి ధర పెరిగింది. దీంతో క్రమంగా రైతు బజారులో కూడా ఉల్లి ధర రూ రూ.30 కి చేరింది. రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి కారణం మహారాష్ట్రలో భారీ వర్షాల వల్ల ఉల్లి దిగుబడి పడిపోయిందని , పశ్చిమ గోదావరి జిల్లాకు దిగుమతులు తగ్గాయని తెలుస్తుంది, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లి దిగుమతులకు జిల్లాకు పెద్ద దిక్కు.. అక్కడి నుండే జిల్లా లోని అన్ని ప్రాంతాలకు చేరుతుంది. అక్కడ ప్రస్తుతం బస్తా (50 కిలోలు) నాణ్యమైనవి రూ.1200కు విక్రయిస్తున్నారు. గత నెల వరకు ఈ రకం రూ.1000కే విక్రయించేవారు. ఇప్పుడు నాణ్యమని చెప్పే ఉల్లి కూడా క్వాలిటీ లేక నిల్వకు ఆగటం లేదని కొందరు హోల్ సేల్ వ్యాపారులు చెపుతున్నారు, ఇక అల్లం ధర బాగా దిగొచ్చింది. గత సంవత్సరం ఇదే సమయానికి కిలో రూ.150 పైగా పలికింది. ప్రస్తు తం కిలో రూ.60కే లభిస్తుంది. పచ్చిమిర్చి ధర భారీగా పడిపోయింది. పది కిలోల మిర్చి హోల్‌సేల్‌ రూ.200కే విక్రయిస్తున్నారు. రిటైల్ గా టమోటా ధర గత నెల కిలో రూ.18 ఉంటె ప్రస్తు తం కిలో రూ.28 కి పెరిగింది. మిగిలిన కూరగాయల ధరలు కూడా వేగంగా పెరుతున్నాయి,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *