సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో శ్రావణమాసం తరువాత కాస్త కూరగాయలు ధరలు తగ్గివస్తున్నాయని సంతోషిస్తున్న సామాన్య కుటుంబీకులకు ఉల్లిధరలు ఘాటెక్కాయి. కోయకుండానే కనీళ్లు తెప్పిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలో కిలో ఉల్లిపై రూ.20 ధర అమాంతం పెరిగింది. ప్రస్తుతం వ్యాపారులు కిలో ఉల్లిపాయలు రూ.45 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. ఈ ఏడాది వేసవి నుంచి ఇప్పటివరకు ఉల్లి ధరలను విశ్లేషిస్తే.. గత మే, జూన్‌ నెలల్లో కిలో రూ.15 పలకగా, ఆగస్టు నెలలో కిలో రూ.20, సెప్టెంబరు నెలలో కిలో రూ.30 ఉండేది. ప్రస్తుతం వ్యాపారులు రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లిపాయలు రూ.45 నుంచి రూ.50 వరకు అమ్ముతున్నారు. ఉల్లి సాగుకు కీలకమైన మహారాష్ట్రతో పాటు రాష్ట్రంలోని కర్నూలు, శంకరంపల్లి, సదాశివునిపేట నుంచి రోజూ ఆంధ్ర ప్రదేశ్ కు రోజుకు 300 టన్నుల ఉల్లి ఆయా ప్రాంతాల నుంచి వస్తుంది. ఇప్పడు దిగుబడి తగ్గింది. ఈ ఏడాది ఉల్లి సాగు ఆలస్యం కావడంతో ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు భావిస్తున్నారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *