సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రస్తుతం భీమవరం రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి 25 రూపాయలు చప్పున, 100 రూపాయలకు 5 కేజీ ల చప్పున వ్యాపారాలు విక్రయాలు జరుపుతున్నారు. దాదాపు తెలుగు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి.. మిగతా కూరగాయలతో పోలిస్తే చవుకగా ఉల్లి వస్తుందని సామాన్యుడు సంతోషిస్తున్నాడు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు అని సామెత..అయితే ఉల్లి సాగుకు కీలకమైన మహారాష్ట్రలో ధరల్లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. ఎగుమతి ఖర్చులు కూడా రాకపోవడంతో ఉల్లి పొలాల్లోనే మురిగిపోతోంది. ధర పలుకుతుందని మార్కెట్కు తెచ్చినా కొనేవారు లేక రోడ్ల పాలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుండే తెలుగు రాష్ట్రాలకు చాల మటుకు ఉల్లి దిగుమతి అవుతుంది. దీంతో అదే స్థాయిలో మార్కె ట్లో ధరలు తగ్గకపోగా.. ఇదే అదనుగా మహారాష్ట్రలో వ్యాపారులు మాత్రం ‘భారీ స్థాయి లో ’ గౌడౌన్ నిల్వలు పెంచేసుకుంటున్నారు. తద్వారా ధరలు లో ‘మాయ బూమ్’ తీసికొనివచ్చి రైతు ఎలాగున్నా తాము బాగుపడాలని ఆలోచన.. ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో ఉల్లి కేవలం రూ. 2 నుంచి 4 పలుకుతుండగా.. నగర మార్కెట్లలో మాత్రం రూ.20 నుంచి 30 వరకు విక్రయిస్తున్నారు. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం ఏమీ చేయడం లేదని, ఉల్లి నిల్వ ఉంచిన గౌడౌన్ లపై దాడి చేయడంలేదని రిటైల్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా ఉల్లి రైతులను ఆదుకోవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉంది
