సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం షూటింగ్ ఇటీవల హడావిడి లేకుండా హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మేకర్స్ నిర్మాణంలో ప్రారంభమయింది. ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీలా ఓ కథానాయికగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా పూజ హెగ్డే నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం శరవేగంగా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రెండ్రోజుల క్రితం శ్రీలీలా సెట్‌లో అడుగుపెట్టారు. పవన్‌కల్యాణ్, శ్రీలీలపై ప్రేమ సన్నివేశాలును తెరకెక్కిస్తున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. రేపు శుక్రవారంతో మొదటి షెడ్యూల్ పూర్తవుతుందని, జూన్, జులైలో తర్వాతి షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ప్రస్తుతం పవన్‌కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’, సుముద్రఖని తో ‘వినోదాయ సీతం’, సాహో ఫెమ్, సుజీత్ దర్శకత్వంలో ఓ చిత్రం చెయ్యనున్నారు.
