సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చే మార్చి 26న విడుదల కానున్న . ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటకు వచ్చిన రెస్పాన్స్ మాములుగా లేదు. అయితే అన్ని హంగులతో మంచి టాక్ సాధించినప్పటికీ OG సినిమా కు సైతం టాక్ వచ్చిన రేంజ్ లో ప్రేక్షకులు కలెక్షన్స్ రాలేదు. దీనికి కారణం పవన్ ను అభిమానించే వారు అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ సినిమాకు కొందరు దూరంగా ఉంటున్నారు. దీనిని గమనించిన దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అభిమానులకు ముందే క్లారిటీ ఇచ్చారు గతంలో తీసిన రాజకీయ సెటైర్లు ఉంటాయన్న ఊహాగానాలు వినిపించినా,ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని చెప్పారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తోనే ప్రేక్షకులనుమాస్ హీరోగా తనదయిన తరహాలో వినోదాత్మకంగా అలరించబోతున్నారు. సినిమాను రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగతంగా లేదా ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉండకూడదని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్‌కు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు
