సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాదిలో రెండు సినిమాలతో తన అభిమానులను అలరించారు. అయితే వాటిల్లో ‘హరి హర వీరమల్లు’ చిత్రం భారీ డిజాస్టర్ గా మారడంతో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. అయితే OG సినిమా వారి అంచనాలు అందుకొంది. ఇక మిగిలింది ‘ ఉస్తాద్ భగత్ సింగ్ ‘ ఒక్కటే. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రిలీజుకు సంబంధించి పవన్ కు సంబంధించి షూటింగ్ పూర్తీ చేసుకొంది. ఇందులో పవన్ సరసన రాశి ఖన్నా, శ్రీ లీలా జంటగా నటిస్తున్నారు. అయితే మిగతా నటీనటులకు చెందిన సన్నివేశాలతో అక్టోబర్ 11 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభ మయ్యి ఈ ఆఖరి షెడ్యూల్ ఈనెల ఆఖరితో పూర్తీ అవుతుందని, వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తామని మైత్రి మూవీస్ మేకర్స్ ప్రకటించారు. అయితే సంక్రాంతి కి ముందే సినిమాలు రిజర్వ్ చేసుకొన్నాయి కాబ్బటి.. సినిమాను మహాశివరాత్రి సందర్భముగా వచ్చే ఫిబ్రవరిలో రిలీజు చెయ్యాలని భావిస్తున్నారు.
