సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక ప్రక్క ఉప ముఖ్యమంత్రిగా పదవి నిర్వహిస్తూనే ఇప్పటికే గత ఏడాది క్రితం అంగీకరించిన సినిమాలను శరవేగం తో పూర్తీ చేసే పనిలో ఉన్నారు. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ కు సిద్ధం కాగా ముంబై లో ‘ఓజీ’ (OG) సినిమా క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తీ చేసారు. ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. ఇక షూటింగ్ చేస్తారో? లేక ఆపివేస్తారు? అన్న అనుమానాలకు చెక్ పెడుతూ నేటి మంగళవారం నుండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్ లో గతం కన్నా మంచి ఫిట్నెస్ తో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. పవన్ రాకతో ఆ సినిమా సెట్ లో పండుగ వాతావరణం నెలకొంది. దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న మైత్రి మూవీస్ వారి చిత్రమిది. మరి ఈ సినిమా తరువాత పవన్ కొత్త చిత్రాలు అంగీకరిస్తారో కొంత విరామము ప్రకటిస్తారో చూడాలి..
