సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: విశాఖ లో ప్రభుత్వ నిర్మాణాల కోసం రిషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా టిట్టర్ వేదికగా స్పందిస్తూ.. . రిషికొండ తవ్వకాలను కప్పి పుచ్చేందుకు, కొండ ను త్రవ్వేసి ఆ స్థానంలో 151 అడుగుల స్టిక్కర్లను అంటిస్తారా? అంటూ ట్విట్టర్లో సెటైర్ వేశారు. చెట్లు, కొండలను నరికివేయడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం అనేది వైసీపీ దుష్ట పాలకుల ముఖ్య లక్షణమని విమర్శించారు. రిషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం సమాధానం చెబుతుందా లేక రిషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్‌ను అంటిస్తారా? అంటూ పవన్ ట్వీట్ చేశారు.
