సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోహిణి కార్తె ప్రారంభం అయ్యింది. సాధారణంగా వేసవి మొత్తంలో ఎండలు అత్యధికంగా ఉండేది ఈ కార్తెలోనే. రోహిణిలో ఎండలకు రోళ్లు కూడా పగులుతాయన్న నానుడి ఉంది. కార్తె వచ్చే ముందే పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలు మారులు 44 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు భయ భ్రాంతులు కు లోనవుతున్నారు. గుడ్డిలో మెల్లలా ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా జిల్లా లో కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు కాస్త చల్లదనం ఉంటుంది. ఐతే భానుడు ప్రచండం మాత్రం మాములుగా లేదు. గత 3 వారాలుగా రాత్రి లేదు పగలు లేదు తీవ్ర ఉక్కపోత తో ప్రజలకు దుస్తులు తడిసిపోవడమే తరువాయి. ఇక రోహిణి వచ్చాక పరిస్థితి ఏమిటన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. వచ్చే నెల 8 వరకు కార్తె ఉండనుండగా జూన్ 4న ఏరువాక పౌర్ణమి వస్తోంది. ఆ లోపు కనీసం ఐదారు రోజులు తీవ్రస్థాయిలో ఎండలు కాచే అవకాశం కనిపిస్తోంది.
