సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. గోదావరి జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు 40-42 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. అయితే భిన్నమైన వాతావరణపరిస్థితులు నేపథ్యంలో..మరోవైపు ద్రోణి ప్రభావంతో మరోసారి వర్షాలు కురస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నేడు, సోమవారం సాయంత్రం నుండి పశ్చిమ గోదావరి, ఏలూరు , శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. రేపు మంగళవారం ఉత్తరాంధ్ర, కాకినాడ, ఏలూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. మేలో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
