సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాహుబలి2 తరువాత మరో తెలుగు సినిమా పుష్ప 2 దేశ సినీ చరిత్రలో అగ్ర స్థానంలో నిలబడింది. ఇండియన్ బాక్సాఫీస్‌ దగ్గర రికార్డు కలెక్షన్స్ ను తిరగ రాస్తున్నాడు పుష్పరాజు గా అల్లు అర్జున్.. పుష్ప 2. ఫస్ట్ డే రూ. 294 కోట్లతో RRR రికార్డ్ బ్రేక్ చేసిన పుష్ప 2. ఆరు రోజుల్లో వెయ్యి కోట్లు, రెండు వారాల్లో రూ. 1500 కోట్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కేవలం 21 రోజుల్లో అంటే మూడు వారాల్లోనే రూ. 1705 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ లెక్కన మరో రూ. 150 కోట్లు రాబడితే చాలు బాహుబలి – 2 రికార్డ్ 1850 కోట్లను అధిగమించట్లే.. ఇప్పటివరకు బాహుబలి -2 దరిదాపుల్లోకి కూడా ఏ సినిమా వెళ్లలేదు.( అయితే అమిర్ ఖాన్ దంగల్ ఇండియా మిగతా దేశాలలో కలపి 500 కోట్లు వసూళ్లు చేస్తే ఒక్క చైనా దేశంలో 1500 కోట్లు వసూళ్లు సాధించి మొత్తం 2000 కోట్ల రికార్డు కు రౌండ్ చుట్టింది) మన పుష్ప రాజ్ దూకుడు చూస్తుందే .. ఇక తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *