సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 2 చట్ట సభలకు ఉన్న ప్రాముఖ్యత అందరికి తెలిసిందే.. అయితే ఏపీ అసెంబ్లీ లో అధికార కూటమి సభ్యులకు తిరుగులేని మెజారిటీ ఉండగా శాసనమండలి లో మాత్రం ఇప్పటికి వైసీపీ సభ్యులకు తిరుగులేని మెజారిటీ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా నేడు, శనివారం (ap legislative council) కాఫీ విషయంలో ప్రభుత్వ పక్షపాత వైఖరి వహిస్తుందని ఆరోపిస్తూ వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసారు. ఛైర్మన్‌ మోషేను రాజు ను అవమానిస్తున్నారని, ఆయనకు గౌరవం ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు నల్ల కండువాలతో సభకు వచ్చారు. వివక్షత నిజమేనని, ఆఖరికి మండలిలో ఇచ్చే కాఫీకి, భోజనాలు కు అసెంబ్లీలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటోందని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు (AP mlc Chairman Moshan Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో, మండలిలో ఒకే రకమైన కాఫీ, భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. శాసనసభ, మండలిలో కాఫీ, భోజనాల విషయంలో తేడాఉండదని ఒకవేళ ..ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అయినప్పటికీ దీనిపై సభలో చర్చ జరగవలసిందే నని రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలని బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *