సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణారావు ఆత్మహత్య కేసులో ఎవరు ఊహించని ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో బోటు కాంట్రాక్టర్ మరియు కీలక వైసీపీ నేత ఒత్తిడి వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరిగినప్పటికీ తాజగా పోలీసులు విచారణలో ఆయన సైబర్ నేరగాళ్ల నుండి ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నాడనే మరొక వాదన కూడా తాజగా వినిపిస్తుంది. . ఎంపీడీవోను బ్లాక్ మెయిల్ చేసిన కీలక నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. రాజస్థాన్ బర్కత్ పుర యువకుడిని గుర్తించి మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా సింగణమల పోలీసుల అదుపులో సైబర్ నిందితుడు ఉన్నాడు. సింగణమల పోలీసు స్టేషన్ పరిధిలోని సైబర్ నేరగాళ్లు నగ్న వీడియో కాల్స్ తో బెదిరించారు. మరో కేసులో విచారణకోసం వెళ్లిన సమయంలో విచిత్రంగా రెండు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. వారిని కస్టడీకి తీసుకొని విచారణ జరిపించేదుకు కృష్ణా జిల్లా పోలీసులు సిద్ధమవుతున్నారు. 25 నుంచి 35 మంది వరకు గ్యాంగ్ సభ్యులు సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. .
