సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం మధ్యాహ్నం సీఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో .. నరసాపురం లోక్ సభ నుండి అనేక అనుమానాలకు తెరదించుతూ .నరసాపురం ఎంపీ అభ్యర్థిగా భీమవరం కు చెందిన గూడూరి ఉమాబాల పేరు ప్రకటించడం తో ఆమె హర్షం ప్రకటించారు. వైసీపీ లోక్ సభ కార్యాలయంలో ఆమె మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. సీఎం జగన్ తనను నరసాపురం లోక్ సభ ఇంచార్జి గా నియమించడమే కాకుండా తాజగా అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడం చాల ఉత్తేజాన్ని తన గెలుపు పట్ల నమ్మకాన్ని మరింత పెంచిందని , మహిళకు అందులో బిసి వర్గానికి చెందిన ఒక సామాన్య కుటుంబానికి చెందిన తనకు ఎంపీ స్థానాన్ని కేటాయించడం సాహసోపేత ఘట్టం అన్నారు. ఆయన నమ్మకాన్ని ఇక్కడ అన్ని వర్గాల ప్రజా బలంతో ఎంపీగా గెలిచి చూపిస్తానని అన్నారు. తాను ఇప్పటికే లోక్ సభ పరిధిలోని దాదాపు అన్ని నియోజకవర్గాలలో వైసీపీ గెలుపు కోసం పర్యటించానని పలువురు నేతలను వైసీపీ క్యాడర్ ను కలసి పార్టీ ప్రతిష్ఠతకు కృషి చేస్తున్నానని ప్రస్తుత సిటింగ్ ఎమ్మెల్యేల నుండి కూడా మంచి మద్దతు లభించిందని వారికే మరల సీట్లు కేటాయించడం హర్షణీయం అన్నారు. తనను స్వయంగా కలసిన, మీడియా మాధ్యమాల ద్వారా వైసీపీ మరియు రాజకీయ పార్టీలకు అతీతంగా అభినందించిన అందరికి కృతజ్ఞతలు అన్నారు. ఇక ఎన్నికల ప్రచారం లో అందరిని సమన్వయ పరిచి ఎన్నికలలో విజయం సాధించడమే కాకుండా మీ కుటుంబ సోదరిగా అందరికి అందుబాటులో ఉండి ఈ లోక్ సభ నియోజకవర్గం ప్రజలను మహిళలను సంక్షేమం తో పాటు మరింత అభివృద్ధి పధంలో నడిపించడమే తన లక్ష్యం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *