సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ లో వారాహి యాత్రలో తనపై తీవ్ర స్థాయి విమర్శలు చేసిన ఫై పవన్ కళ్యాణ్ ఫై నేడు, ఆదివారం విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.. జనం నన్ను గెలిపిస్తే నన్ను ఎంపీ పదవికి రాజీనామా చెయ్యమనడానికి నువ్వెవడివి రా ? 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన నువ్వు సిగ్గులేకుండా నన్ను రాజీనామా చేయమంటావా?కనీసం ఎమ్మెల్యే గా కూడా గెలిచే స్థాయి లేని పవన్ ఎంపీగా గెలిచిన నా గురించి మాట్లాడుతున్నా రు. ఇక్కడ గాజువాక లో ఓడిపోయాక ఒక్కసారి అయిన ప్రజల వద్దకు వచ్చవా?నువ్వు బెదిరింపు రౌడీ బాషా మనకపోతే నీకు తగిన శాస్తి జరుగుతుంది అని హెచ్చరించారు. ఎవరు విశాఖను దోచేస్తున్నారు? చంద్రబాబు కు నువ్వు బానిస వి.. చంద్రబాబు ఆయన అనుచరులు విశాఖ ను ఎంత దోచేసారో నీకు తెలుసా? గీతం యూనివర్సిటీ వారు ఎంత దోచేసారో తెలుసా? నీకు విశాఖ గురించి కానీ , మాస్టర్ ప్లాన్ అం టే ఏంటో కనీస పరిజ్ఙానం లేదని దుయ్య బట్టారు. సీఎం జగన్ గురించి పీఎం మోడీకి చెబుతావా? అంత చనువు ఉందా ? అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రవేటు పరం చెయ్యద్దు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని నువ్వు చెపితే మోడీ ఇచ్చేస్తారు కదా? ‘‘పవన్ ప్యాకేజ్ తీసుకుని చం ద్రబాబు బూట్లు నాకుతున్నా రు. బ్రో సినిమాతో డిస్టిబ్యూటర్లు భారీగా నష్టపోయారు వారికీ లాస్ తిరిగి ఇచ్చేస్తావా? నువ్వు సీఎం అభ్యర్థివి అని చంద్రబాబుతో చెప్పించగలవా?.నేను నీకు వైజాగ్ లో మద్దతుగా వస్తాను అని సవాల్ చేసారు ఎంపీ సత్యనారాయణ..
