సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వర్గీయ వై ఎస్ కు నమ్మిన బంటుగా వైసీపీ ఆవిర్భావము నుండి గోదావరి జిల్లాలో వై యస్ జగన్ కు మద్దతుగా అండగా నిలచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తాజాగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు, ఆయన సేవలను గౌరవించి సీఎం జగన్ ఆయనను రాజ్య సభ సభ్యుడిని చేసి పార్లమెంట్ కు పంపిన విషయం అందరికి తెల్సిందే,అయితే పిల్లి.. స్వస్థలం .. కోనసీమ జిల్లా, రామచంద్రాపురం వైసీపీ లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్ప టికే అక్కడ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎం పీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి పం చాయతీ తాడేపల్లి ప్యా లెస్ కు చేరుకుంది. వీరి సయోధ్య కు ముఖ్యమంత్రి జగన్ యత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది, ఈ నేపథ్యంలో పిల్లి సుభాష్ నేడు, ఆదివారం మీడియా ముఖంగా .. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రామచంద్రపురం సీటు తన కుటుంబ సభ్యులకే కేటాయించాలని లేకపోతె తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా వేణుపై పోటీకి దిగుతానని హెచ్చరించడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది, ఒక ప్రక్క సీఎం జగన్ అమలాపురం పర్యటనకు వస్తున్నా నేపథ్యంలో .. గోదావరి జిల్లాలో వైసిపి నేతలలో గొడవలు తీర్చే పెద్ద మనిషి పిల్లి సుభాష్ ఇలా వ్యవహరించామేమిటి? అని మదన పడుతున్నారు వైసిపి పెద్దలు..
