సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఆర్థిక కుంభకోణాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై సిబిఐ దర్యాప్తు జరపాలని కోరుతూ.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిల్‌పై నేడు, బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ పిల్‌పై నాట్ బిఫోర్ మి.. అని ధర్మాసనంలోని న్యాయమూర్తి అన్నారు. సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వేసిన పిటీషన్‌పై విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు పిల్ విచారణకు వచ్చింది. పిల్‌పై విచారణ ప్రారంభమైన వెంటనే ‘‘Not Before Me’’ అని ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు అన్నారు. దీంతో మరో ధర్మాసనం ముందు విచారణకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ అయ్యాయి.
