సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో తన నివాసానికి వచ్చిన రఘురామా కృష్ణంరాజు ను నేడు, ఆదివారం ఉండి తెలుగుదేశం ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ మరియు భీమవరం మాజీ టీడీపీ ఎమ్మెల్యే అంజిబాబు,కోళ్ల నాగేశ్వరరావు మరియు బీజేపీ నేత భూపతిరాజు శ్రీనివాస వర్మ తదితర ప్రముఖులు కలుసుకొన్నారు. నేటి మధ్యాహ్నం ప్రెస్ మీట్ కోసం వెళ్లిన మన సిగ్మా న్యూస్ ( ప్రసాద్ ) తో పరామర్శలు తదుపరి, ఎంపీ రఘురామా మాట్లాడుతూ.. 4 ఏళ్ళ తరువాత భీమవరంలో నా ఇంటికి రాగలిగానని .. నేను పడ్డ కష్టాలు పరిస్థితి అర్ధం చేసుకొని ఇప్పటికి నాపై గతానికి మించిన అభిమానంతో రాజమండ్రి నుండి భీమవరం వరకు ప్రజలు టీడీపీ జనసేన నేతలు ఘన స్వాగతం పలకడం జీవితంలో మర్చిపోలేనన్నారు. తదుపరి రచ్చబండ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అద్భుత విజయం సాధించబోతుందని..ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నా గురించి మరోసారి చర్చించుకున్నారు. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసినవారే నిజమైన ఆత్మీయ బంధువులు. అల్లూరి విగ్రహావిష్కరణకు భీమవరం రానివ్వలేదు.తన ఎంపీ ల్యాడ్స్ నిధులను ఆచంట, నరసాపురంలలో ఖర్చుచెయ్యకుండా అక్కడి ఎమ్మెల్యేలు అడ్డుకున్నారని రఘురామ ఆరోపించారు. మిగిలిన అన్ని నియోజకవర్గాలలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో పనులు చేయించగలిగానన్నారు. నా విజ్ఞప్తి తో హుబ్లీ రైలు వచ్చింది. రాబోయే రోజుల్లో మరిన్ని కొత్తరైళ్లు నరసాపురం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువకాగలిగానని, అందుకు ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అన్నారు.
