సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,మంగళవారం జరిగిన లోక్‌సభ సమావేశాలలో జీరో అవర్‌లో.. వైసిపి రెబల్.. నర్సాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు మాట్లాడుతూ.. ఏపీలో జగన్ సర్కార్ కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న పంచాయతీ నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో గ్రామస్వరాజ్యానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.569కోట్లలో ఒక్క పైసా కూడా పంచాయతీలకు వెళ్లలేదని, గతంలో పంచాయితీలకు 10 రోజుల్లో నిధులను విడుదల చేయాలని కేంద్రం ఆదేశించినా గత మూడు నెలల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. పంచాయితీలలో ప్రజలు ఎన్నుకొన్న ప్రజా ప్రతినిధులకు విలువ లేకుండా చేసారని అన్నారు. వలంటీర్ వ్యవస్థ వల్ల కూడా పంచాయతీలకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థపై కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *