సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్‌కు ఎంపిక కాగా, తమిళనాడు నుంచి వైజయంతీ మాల బాలి పద్మ విభూషణ్‌కు ఎంపికయ్యారు. అలాగే తెలుగువారికి సుపరిచితులు అయిన మిథున చక్రవర్తి, ( డిస్కో డాన్సర్, గోపాలా.. గోపాలా )దివంగత నటుడు విజయ్‌కాంత్ (సింధురపువ్వు కెప్టెన్ ప్రభాకర్), గాయని ఉషా ఉతప్ ( కీచురాళ్లు ) పద్మ భూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగువారి పెద్దరికానికి నిలువుటద్దం, బహుభాషా కోవిదుడు మంచి వక్త.. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు , మెగాస్టార్ చిరంజీవి అచ్చమైన తెలుగువారు తెలుగు ఖ్యాతి ని దేశానికీ చాటిన సుప్రసిద్ధులు.. మెగా స్టార్ తెలుగు వారి హీరోగా ఉన్నత శిఖరాలకు చేరుకొన్న తీరు . బ్లడ్ బ్యాంకు, కరోనా సమయంలో , ఇతరాత్ర కష్టాలలో తోటి సహచర నటీనటులకు చేసిన సహాయం తదితర సామజిక సహకారం అంశాలలో చేసిన కృషి కి ఆయనను ప్రతిష్టాకరమైన పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఈ అరుదయిన గౌరవం ఇచ్చిన తెలుగు ప్రజలకు భారత ప్రధాని మోడీ కి కృతజ్ఞతలు తెలుపుతూ చిరంజీవి భావోద్వేగం కు గురిఅయ్యారు.
