సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి విశాఖలో యువగళం లోకేశ్ పాదయాత్ర ముగింపు విజయోత్సవ సభకు రాను రాను.. అంటూనే హాజరు అయిన జనసేనాని పవన్‌కల్యాణ్ ను ప్రసంగించేందుకు ఆహ్వానించే సమయంలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు .. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్, అని ముందరకాళ్లకు బంధం వేస్తూ ఆహ్వానం పలికారు. ఇక పవన్ కల్యాణ్ తనదయిన ధోరణి లో మాట్లాడుతూ.. అధికార వైసీపీ అరాచక పాలనను వ్యతిరేకిస్తూ వారిని అధికారం నుండి దించడానికే తాను కృషి చేస్తున్నానని అందుకే ప్రజల మేలు కోసం తెలుగు దేశం తో “ఏమీ ఆశించి పొత్తు పెట్టుకోవడం లేదు. గతంలో 10 ఏళ్ళ క్రితం రాష్ట్ర విభజన సమయంలో పార్టీ పెట్టి పోటీ చేయకుండానే టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చాను” ఇప్పుడు మాత్రం స్వార్ధం ఏమి ఉంటుంది.. లోకేష్ ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పాటు చేసిన పాదయాత్రను అభినందిస్తున్నాను అని అన్నారు. దానితో పవన్ బహిరంగ వేదికపై చెప్పిన మాటలను చంద్రబాబు తన రాజకీయ చతురతతో అక్కడే ‘జనసేన’ ను ‘లాక్’ చేస్తూ ఏమన్నారంటే.. “సభలో పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా, నిజాయితీగా మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని, మరోసారి ఆ పార్టీ అధికారం లోకి రాకుండా ఉండడానికే టీడీపీతో చేతులు కలిపానని చెప్పారు. ఆయన నిజాయితీని అభినందిస్తున్నా” అని చంద్రబాబు అన్నారు.దీనితో టీడీపీ క్యాడర్ కు సీట్ల సర్దుబాట్లలో ఇబ్బందులు ఉండవు అని ఒక సంకేతం వెళ్ళిపోయింది. వీరి మాటలు మరో కోణంలో చుస్తే.. జనసేన కు తక్కువ సీట్లకే పరిమితం చేస్తారా? దానికి పవన్ ఒప్పేసుకొన్నారా?వైసీపీని అధికారంలో నుంచి దించాలన్న యావ ఉన్న ఇరు పార్టీలలో ‘టీడీపీ కి మాత్రమే అధికారం సాధించాలని పట్టుదల‘ ఉంటె జనసేనానిలో ఆ ఆశ లేనట్లు మరోసారి స్వష్టం అయ్యింది. అధికారంలో ఉన్న వారిని దించడంతో పాటు అధికారంలోకి రావడం కూడా ‘రాజకీయ పార్టీల లక్ష్యం.. మరి ఏ లక్ష్యంతో ..? పార్టీనే నమ్ముకుని 10 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేసి.. జయా పజయాలకు అతితతంగా కొనసాగుతున్న జనసేన క్యాడర్ భవిషత్తు ను అధికార వైసీపీ తో పోరుకు మాత్రమే పరిమితం చేస్తారా? ఎక్కడ తగ్గాలో కాదు.. ఎక్కడ తప్పును సరిద్దుకొన్నాడో వాడు గొప్పోడు..
