సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేటి , బుధవారం ఉదయం హైదరాబాద్ లో ఏపీ సీఐడీ అధికారులు తనకు జారీ చేసిన నోటిసులపై నరసాపురం,ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… తనకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని, వారు సూచించిన మేరకు ఈ నెల 17న సీఐడీ విచారణకు హాజరవుతున్నట్లు చెప్పారు. గత కేసుల్లో మరిన్ని వివరాలు తీసుకునేందుకు రావాలన్నారని తెలిపారు. పండగ సమయంలోనే విచారణకు ఎందుకు పిలిచారో? అని అనుమానం వ్యక్తం చేసారు. ఈ రావణ రాజ్యంలో ప్రజలు విసుగుచెందారని, జగన్‌రెడ్డిది ఆటవిక పాలన అని విమర్శించారు. ఒక సందర్భములో తాను పవన్ కల్యాణ్ అభిమాని అని చెప్పారు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడిని’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న నేపథ్యం తెలిసిందే.. రాజకీయాలలో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని సామెత ఇక్కడ గమనార్హం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *